Gold Rings Stolen From Jewellery Shop బంగారం కొంటానని చెప్పి 48 ఉంగరాలతో ఉడాయించిన దుండగుడు.. పట్టుకునే పనిలో పోలీసులు - Gold theft in Challapally
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 3:29 PM IST
|Updated : Sep 8, 2023, 5:35 PM IST
Gold Rings Stolen From Swati Jewellery Shop: కృష్ణా జిల్లా చల్లపల్లిలో గురువారం రాత్రి స్వాతి జ్యూయలరీ షాపులో బంగారం చోరీకి గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది. షాపు యజమాని యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి ఉంగరాలు కొంటానని వచ్చి సెలక్ట్ చేస్తున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా ఉంగరాలుండే బాక్సు చేత పట్టుకుని బయటకు పరుగులు తీశాడని తెలిపారు. ముందుగానే షాపు బయట ద్విచక్ర వాహనంపై ఒకరు సిద్ధంగా ఉన్నారని.. ఇతను ఉంగరాలతో ఆ వ్యక్తితో కలిసి పరారయ్యాడని యజమాని అన్నారు. ఆ వ్యక్తి రెండు రోజులుగా వస్తున్నాడు.. సరిగ్గా షాప్ మూసే సమయంలో వస్తున్నాడని అన్నారు. షాప్ మూసే సమయం అయిందని చెప్పినా వినకుండా లోపలికి వచ్చి ఉంగరాల బాక్సు లాక్కేళ్లాడని తెలిపారు. సమాచారం అందుకున్నచల్లపల్లి సీఐ బిబి రవికుమార్, ఎస్సై చినబాబు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. సుమారు రూ.4 లక్షలకు పైగా విలువైన 48 ఉంగరాలు చోరీకి గురైనట్లు షాపు యజమాని యుగంధర్ తెలిపారు.