విషాదాన్ని నింపిన పదేళ్ల చిన్నారి మరణం - తండ్రి ఆటో నడుపుతుండగా జారిపడి - గుత్తి ఆటో ప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 1:50 PM IST
Girl Child Died Falling From Auto: తండ్రి ఆటో నడుపుతుండగా పక్కనే కూర్చున్న పదేళ్ల కూతురు ఆటోలో నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది. గుత్తి పట్టణానికి చెందిన మహమ్మద్ భాష స్థానికంగా భవన నిర్మాణ కార్మికుడిగా, పని దొరకని సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రతి ఆదివారం పెద్దవడుగూరు మండలంలోని వెంకటంపల్లిలోని తన తల్లిదండ్రులను భాష తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా వెళ్లి కలిసి వచ్చేవాడు.
ఎప్పటిలాగానే ఈ ఆదివారం కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు భాష తన ఆటోలోనే బయల్దేరాడు. ఆటోలో అతని పక్కన తన కుమార్తె ఆలియా కూర్చుంది. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో గుత్తి మండలం కొత్తపేట వద్దకు రాగానే అతని పక్కనే కూర్చున్న అలియా పట్టు జారీ ఆటో నుంచి కిందకు పడిపోయింది. దీంతో ప్రమాదాన్ని గమనించిన భాష ఆటో ఆపి చిన్నారిని హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కళ్లముందే చిన్నారి మరణంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది.