పేలిన గ్యాస్ సిలిండర్ల ట్రక్కు.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. డ్రైవర్, ఆపరేటర్ చాకచక్యంగా.. - గ్యాస్ సిలిండర్ లారీకి మంటలు ఉత్తరాఖండ్ టెహ్రీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2023/640-480-18872098-thumbnail-16x9-skjfs.jpg)
Gas Cylinder Truck Explosion : ఉత్తరాఖండ్ టెహ్రీ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్లలతో వెళ్తున్న ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే ట్రక్కు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆపరేటర్ చాకచక్యంగా వ్యవహరించిన త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇదీ జరిగింది.. 40 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో ఓ ట్రక్కు ఘన్సాలీ వైపు వెళ్తోంది. కందిఖాల్ సమీపంలోకి రాగానే ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రక్కులో ఉన్న సిలిండర్లు భారీ శబ్ధంతో పేలి.. చాలా దూరం ఎగిరిపడ్డాయి. భారీ శబ్ధాలు విన్న స్థానికులు.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ, మంటలు ఎగసిపడుతుండటం వల్ల పూర్తిగా ఆర్పలేకపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రక్కు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్, ఆపరేటర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రక్కు కాలిపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.