Ganja Seized in Chinatapalli: అల్లూరి జిల్లాలో రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - Ganja Seized in Chinatapalli alluri dist
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-08-2023/640-480-19230545-1101-19230545-1691668165118.jpg)
Ganja Seized in Chinatapalli:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం సాడిక గ్రామంలో రూ.కోటి విలువైన 490 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాడిక గ్రామానికి చెందిన కిముడు శివ, బేరా సతీష్‌కుమార్‌లు ఒడిశా రాష్ట్రంలో గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని కప్పగొంది గ్రామానికి చెందిన ఓ నలుగురి సహకారంతో సాడిక గ్రామంలో ఉన్న టేక్ ప్లాంటేషన్ వద్దకు తీసుకువచ్చారు. కొనుగోలు చేసిన ఆ గంజాయిని అమ్మడానికి వారు ప్రయత్నించారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న చింతపల్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంబడించి.. ఇద్దరిని పట్టుకున్నారు. 490 కేజీల గంజాయి, రూ.74 వేల నగదు, ఆటో, ద్విచక్ర వాహనాలను నిందితుల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నిందితులను సతీష్‌కుమార్, కొర్రా వెంకటరావులుగా గుర్తించినట్లు.. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రమేష్ తెలిపారు.