Minister Amarnath మంత్రి అమర్నాథ్కు నిరసన సెగ.. ఓట్లకోసమే ప్రజలున్నారా! ధ్వంసమైన శిలాఫలకం.. - GADAPA GADAPAKU PROGRAM
🎬 Watch Now: Feature Video
Villagers Fires on Minister Gudivada Amarnath: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్కు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాలుగేళ్లకు ఊరు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రిని మహిళలు కడిగిపారేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రజలు కావాలా అంటూ మంత్రిని నిలదీశారు. అనకాపల్లి మండలంలోని కొత్త తలారివానిపాలెంలో కాలువ నిర్మాణ పనులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సమయంలో మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొంతమంది మహిళలు మంత్రి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయని.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ పనులకు అమర్నాథ్ శిలాఫలకం ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు.. శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల అనకాపల్లి మండలం శంకరంలోనూ కాలువ పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పగలగొట్టారు. వైసీపీలో వర్గపోరు వల్లే మంత్రి అమర్నాథ్ వ్యతిరేక వర్గీయులే శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.