నాలుగున్నర ఏళ్లలో ఒక్క సమస్య అయినా తీర్చారా - గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతకు ఎదురైన చేదు అనుభవం - ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 7:23 AM IST

People Asks Local Issues In Education Adviser Sambasiva Reddy: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాచేపల్లిలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త..ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డికి నిరసన సెగ తగిలింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం రాచేపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నఆయన్ను.. గ్రామాంలో సరిగ్గా రోడ్లు, డ్రైనేజీ , వీధిలైట్లు లేవు అని ఎన్ని సార్లు చెప్పిన ఏ మాత్రం అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్థులు నిలదీశారు. 

గ్రామానికి ఇరుపక్కల వాగు, వంకలు ఉన్నా తాగడానికి నీరు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాచేపల్లి గ్రామపంచాయతీ అయితే నిధనవాడలో సచివాలయం ఎలా నిర్మిస్తారని గ్రామస్థులు ప్రశ్నించారు. మా గ్రామంలో ఉన్న సచివాలయం వేరే గ్రామానికి ఎందుకు తరలిస్తున్నారు అంటూ  మండిపడ్డారు. మా సచివాలయం మాకే కావాలంటూ సాంబశివరెడ్డిని అడిగారు. రాచేపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని ప్రభుత్వ సలహాదారు సాంబశివరెడ్డికి వివరించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అక్కడి నుంచి జారుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.