దాచేపల్లిలో ఫ్రూట్ మార్కెట్ తరలింపు - వ్యాపారుల ఆందోళన - fruit sellers protest municipal commisioner police
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 3:07 PM IST
Fruit sellers Protest in Palnadu: పల్నాడు జిల్లా దాచేపల్లిలో పండ్ల వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఫ్రూట్ మార్కెట్‌ను ఉన్న స్థలం నుంచి వేరే ప్రదేశానికి తరలించటాన్ని తప్పు పడుతూ నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డుపై బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న తమపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల మార్కెట్ నుంచి తమను ఖాళీ చేయించటాన్ని వ్యాపారులు తప్పు పడుతూ ఆందోళనకు దిగారు.
Fruit Market Changed to Another Place: నాగులేరు వద్ద కేటాయించిన స్థలంలోకి తరలివెళ్లాలని అనేక సార్లు మున్సిపల్ అధికారులు సూచించారని వ్యాపారులు తెలిపారు. వ్యాపారానికి కేటాయించిన స్థలం వ్యర్థాలతో ఉండడం వల్లే నిరాకరిస్తున్నామని, ఆ ప్రాంతంలో తాము వ్యాపారాలు ఎలా చేసుకోగలమని అధికారులను వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కేటాయించిన స్థలంలోకి వెళ్లడానికి మేము నిరాకరించడం వల్లే ఈరోజు పోలీసులు సహకారంతో తరలించారని వ్యాపారులు తెలియజేశారు. పూలు, పండ్ల బండ్లను జేసీబీతో తొలగించడంతో నష్టం జరిగిందని వ్యాపారులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్, పోలీసులకు వ్యతిరేకంగా వ్యాపారులు నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.