ఎమ్మెల్యే కన్నబాబు అనుచరుడి మోసం - డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు - Frauds of YCP leaders in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 3:59 PM IST

Frauds of YCP Leaders in Kakinada District : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అనుచరుడైన వెంకటేశ్వరరావు మోసం చేయడమేగాక బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వెంకటేశ్వరరావు తమ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని నగదు చెల్లించకుండా బెదిరింపులకు దిగుతున్నాడని బాధితుడు వాపోయాడు. కాకినాడ జిల్లా జగన్నాథపురానికి చెందిన కుందూరి వరప్రసాద్, అతని సోదరులకు కరప మండలంలో అరట్లకట్ల వద్ద 160 గజాల స్థాలం ఉంది. వీరికి అప్పులు ఉండటంతో రూ.10లక్షల ఒప్పందంతో వెంకటేశ్వరరావుకు స్థలాన్ని విక్రయించారు. 

Frauds of YCP Leaders in Sale of Land : స్థాలాన్ని తనపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంకటేశ్వరరావు కేవలం రూ.లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని వరప్రసాద్ తెలిపాడు. ఒప్పందం ప్రకారం మెుత్తం డబ్బులు చెల్లించమని అడిగితే తనను కులం పేరిట దూషించారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై హ్యూమన్ రైట్స్ ప్రతినిధి బొజ్జా ఐశ్వర్యతో కలిసి బాధితుడు డీఎస్పీ కార్యాలయం వెళ్లి వెంకటేశ్వరరావుపై  ఫిర్యాదు చేశారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుంటే ధర్నా చేస్తానని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.