Former Union Minister Renuka Chaudhary Fires On YSRCP Govt: "ఎటువంటి ఆధారాలు లేకుండా హింసించి, వేధించడం న్యాయమా"
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 11:44 AM IST
Former Union Minister Renuka Chaudhary Fires On YSRCP Govt: పిచ్చోడి చేతిలో రాయిలా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె.. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చి బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటోగా స్వీకరించి.. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ పేరిట అబాంఢాలు మోపారని అన్నారు. కావాలనే ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు లేకుండా హింసించి, వేధించడం న్యాయమా అని ప్రశ్నించారు. రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించి చేసే పరిపాలన ఎన్ని రోజులు సాగిస్తారని నిలదీశారు. జగన్‌కు ఉన్న స్కిల్‌ను మెచ్చుకోవాలని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. న్యాయం, ధర్మం పేరు చెప్పే షర్మిల, విజయమ్మ ఇంతవరకు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రాన్ని అంతా కలిసికట్టుగా ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.