జగన్‌రెడ్డిది అహంకారం - ఇంటికి పంపడానికి జనం సిద్ధం : యరపతినేని - మాజీ ఎమ్మెల్యే యరపతినేని
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2024, 2:25 PM IST
Yarapathineni Srinivasarao fire on Jagan : జగన్మోహన్ రెడ్డి వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలివేయాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరులోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు భవిష్యత్తులో జగన్ మెడకు ఉరి తాళ్లు కానున్నాయని హెచ్చరించారు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగి, అంబేడ్కర్ రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ని ఇంటికి పంపడానికి ఐదు కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయ విధానాలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని, సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా లో ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని మండిపడ్డారు.
నాలుగేళ్లుగా టీడీపీని తిట్టించి ఇప్పుడు వారికే టికెట్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనించి జగన్ నైజాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో సంక్రాంతి సంబరాలకు టీటీడీ సొమ్ముతో సెట్టింగ్ వేయడంపై మండిపడ్డారు. తనతో పాటు కొందరు టీడీపీ ముఖ్యనేతలు పార్టీ మారుతున్నట్లు జగన్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను వైసీపీలో చేరటం అంతే నిజమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువత వైసీపీ ప్రభుత్వంపై కసితో ఉన్నారని, వారంతా టీడీపీ- జనసేనను గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.