ప్రకృతి కరుణించక, పాలకులు స్పందించక రైతన్నకు నష్టం - ఎండిన పంటలను పరిశీలించిన కాలవ - latest updates on Kalava Srinivasulu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 7:07 PM IST
Former Minister Kalava Srinivasulu seeks compensation for lost crops: హెచ్ఎల్సీ ఆయకట్టు కింద పంటలు ఎండిపోవటానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో పలు గ్రామాల్లో ఎండిపోతున్న హెచ్ఎల్సీ ఆయకట్టు పంటలను కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. ప్రకృతి చేసిన నష్టంతో వర్షాధార పంటల రైతులు నష్టపోగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆయకట్టు రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
ఓ వైపు ప్రకృతి కరుణించక, మరోవైపు పాలకుల పాపంతో ఖరీఫ్, రబీ పంటలు నష్టపోవాల్సి వచ్చిందని కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయదర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ ప్రాంతాల్లో ఆయకట్టుకు నీరు అందివ్వకపోవడంతో పంటల నష్టం తీవ్రంగా ఉందని తెలిపారు. పంట నష్టంపై ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం జగన్ దృష్టికి తీసుకుపోలేదని తెలిపారు. తుంగభద్రలో ఆంధ్రప్రదేశ్ వాటాను వాడుకోలేకపోతుందని పేర్కొన్నారు. వైసీపీ నేతల చేతగాని తనంవల్లే పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆయకట్టు కింద పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు లక్షన్నర రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. లేకపోతే జగన్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.