రాజకీయాల ద్వారా ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశముంది : అంబటి రాయుడు - encourage sports ambati

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 9:35 PM IST

Former Cricketer Ambati Rayudu Interacted with the Students : ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులతో.. ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విభజన వల్ల రాష్ట్రం చాలా కోల్పొయిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. యువతను క్రీడారంగంలో ప్రొత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానన్ని పిలుపునిచ్చారు.

సొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే భావనతోనే ప్రజాజీవితంలోకి వస్తున్నట్లు అంబటి రాయుడు తెలిపారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా కన్నా.. రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజలకు ఎక్కువ సేవ చేయటానికి ఆస్కారం ఉంటుందన్నారు. కుల, మతాలు అనే రెండు గోడలను బద్దలు చేస్తేనే.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడటం తనకు చాలా సంతోషంగా ఉందని అంబటి రాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.