Forest Officials Caught Bear in Mahanandi: మహానంది ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి.. పట్టుకున్న అడవిలో వదిలేసిన అటవీ సిబ్బంది - bear trapped in Mahanandi
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2023, 5:01 PM IST
Forest Officials Caught Bear in Mahanandi: గత కొన్ని రోజులుగా నంద్యాల జిల్లా మహానంది ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆలయ సమీంలోని టోల్గేట్ వద్ద శిథిలమైన తెలుగుగంగ క్వార్టర్స్‌లో ఉన్న ఎలుగు బంటిని స్థానికులు గుర్తించారు. అటవీ శాఖ సిబ్బంది ఎలుగును గదిలో బంధించారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని పట్టుకుని అడవిలో వదిలివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మహానందిలో గత కొన్నిరోజులుగా ఎలుగు పలుమార్లు కనిపించటంతో స్థానికులు, భక్తులు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు కూంబింగ్ నిర్వహించి.. చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం బోను ఉన్న వాహనంలో ఎలుగుబంటిని తీసుకెళ్లి దట్టమైన అడవుల్లో వదిలారు. కొద్ది రోజుల క్రితం ఆలయ ఆవరణలో ఎలుగుబంటి సంచరించడాన్ని కొంతమంది స్థానికులు చూశారు. అదే విధంగా అంతకు ముందు మహానందిలోని ఈశ్వర్ నగర్లో సైతం ఎలుగుబంటి కనిపించింది. దీంతో గత పది రోజులుగా మహానంది పరిసరాల్లో మూడు సార్లు ఎలుగు కనిపించింది.