Pilli Subhash followers గెలిపిస్తే.. మాపైనే రౌడీషీటా! మంత్రికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల భేటీ - మంత్రి వేణు
🎬 Watch Now: Feature Video

A meeting of Pilli Subhash Chandra Bose's followers: కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబోస్‌పై అభిమానంతో మంత్రి వేణును గెలిపించామని.. పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడుతున్న తమపైనే రౌడీషీట్ తెరుస్తున్నారని చంద్రబోస్ వర్గీయులు ఈ సందర్భంగా ఆరోపించారు. వేణు కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని.. వైసీపీని మంత్రి వేణు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిబలిజలను మంత్రి వేణు తొక్కేస్తున్నారని.. ఈసారి వేణుకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబోస్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని.. వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా బోస్ కుమారుడిని గెలిపిస్తామని బోస్ అభిమానులు అన్నారు. తాను 12 కోట్లు ఖర్చు పెట్టానని.. డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 26న అమలాపురంలో సీఎంను కలిసి పరిస్థితులు వివరిస్తామని చెప్పిన చంద్రబోస్ అనుచరులు... వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్‌కు వైసీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.