విస్తరించిన మిచౌంగ్ తుపాన్ - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-12-2023/640-480-20180080-thumbnail-16x9-floods-to-swarnamukhi-due-to-michaung-cyclone.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 11:38 AM IST
Floods to Swarnamukhi Due to Michaung Cyclone: మిచౌంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదికి వరద ఉధృతి పెరిగింది. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని లంక మిట్ట కాలనీవాసులను అధికారులు తుపాను పట్ల అప్రమత్తం చేశారు. వారికి తుపాను నుంచి ప్రమాదం పొంచి ఉండడంతో సురక్ష కేంద్రాలకు తరలించారు.
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల తిరుపతి జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనివల్ల జిల్లాలోని పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శ్రీకాళహస్తి - పంగురు రహదారిపై ఈదులు కాలం వద్ద వరద నీరు ప్రవహించడంతో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు కాజ్వే పై ఆగింది స్థానికుల గుర్తించి ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి - పల్లం, శ్రీకాళహస్తి - పిచ్చాటూరు రహదారిపై వాగులు పొంగుతుండటంతో అధికారులు వాహన చోదకులను అప్రమత్తం చేసి దారి మళ్లించారు.