భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు - రాకపోకలకు అంతరాయం - manyam district flood water in roads
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 4:48 PM IST
Flood Water Over Flowing In Roads In Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో రంపచోడవరం, మన్యం ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. అక్కడ నివసిస్తున్న గిరిజనులకు రాకపోకలు నిలిచి పోవడంతో తీవ్ర ఇబ‌్బందులకు గురయ్యారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పందిరిమామిడి వంతెన వద్ద సీత పెళ్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పందిరి మామిడి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కూడా వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల భూపతిపాలెం జలాశయం నిండిపోయింది. భూపతిపాలెం జలాశయం గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (Integrated Tribal Development Agency Project Officer) సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే సహాయక చర్యలు చేపట్టారు.