పరీక్ష కోసం కుటుంబం సాహసం.. పీకల్లోతు నీటిలో ఈదుతూ - marrivalasa village
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16330310-894-16330310-1662743696760.jpg)
Floods in Vizianagaram: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని చంపావతి నదిలో ఏమాత్రం వరదొచ్చినా ఆవలవైపు ఉన్న గ్రామాల ప్రజలు సాహసం చేయాల్సిందే. ఏటా వర్షాకాలం, తుపాన్లు, ఆండ్ర జలాశయ ప్రధాన గేట్లు ఎత్తి నదిలోకి నీటిని విడిచిపెట్టే సమయంలో ఆయా ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు ప్రవాహాన్ని దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండ్రోజులుగా ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఈక్రమంలో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న మెంటాడ మండలం మర్రివలసకు చెందిన యువతి, ఈ నెల 10న విశాఖలో జరగనున్న ఉద్యోగోన్నతి అర్హత పరీక్షకు వెళ్లాల్సి ఉంది. వరద తీవ్రత అధికంగా ఉండడంతో శుక్రవారం ఆమె సోదరుల సాయంతో పీకల్లోతు నీటిలో ఇలా ప్రమాదకరంగా నదిని దాటారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST