Flexi war in Kavali: "మా ఫ్లెక్సీలు తొలగిస్తే గొంతు కొసుకుంటా".. మున్సిపల్ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ హెచ్చరిక - ap latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-09-2023/640-480-19458575-thumbnail-16x9-flexi-war-in-kavali.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 12:34 PM IST
Flexi War in Kavali : నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారు. అందులో భాగంలో టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సంఘటన మరువక ముందే కావలిలో మున్సిపల్ సిబ్బంది టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగిస్తుండంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ ఫ్లెక్సీలను తొలగించకుండా, కేవలం తమ పార్టీ తొలగిస్తే గొంతు కొసుకుంటామని అధికారులను హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయ పార్టీ ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తంగా మారింది. రెండు రోజులుగా టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది వెనుదిరిగారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగిస్తే గొంతు కోసుకుని మరణిస్తానని మున్సిపల్ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ చిన్న కిరణ్ హెచ్చరిక చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పురపాలక సిబ్బంది టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేవలం తమ పార్టీ ఫ్లెక్సీలు తొలిగిస్తున్నారని, తొలిగిస్తే అన్ని పార్టీల ప్లెక్సీలు తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.