Flexi Controversy in Mangalagiri: మంగళగిరి నగరపాలక సంస్థ సిబ్బంది అత్యుత్సాహం.. టీడీపీ ఫ్లెక్సీల తొలగింపునకు యత్నం - Nara Lokesh Yuvagalam Padayatra updates
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-08-2023/640-480-19261301-315-19261301-1691997739684.jpg)
Flexi Controversy in Mangalagiri: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో అధికార పార్టీ శ్రేణులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. యువనేత లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా మంగళగిరిలో లోకేశ్‌కు స్వాగతం పలుకుతూ.. ఆ పార్టీ నేతలు పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలను తొలగించేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది యత్నించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో నగరపాలక సిబ్బంది, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
TDP leaders fire on Mangalagiri municipal staff.. గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. బుధవారం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లోకేశ్‌కు ఘన స్వాగతం పలుకుతూ.. పార్టీ నేతలు బస్టాండ్ వద్ద ప్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని తొలగించేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది యత్నించారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు.. మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి.. ప్లెక్సీలు తొలగిస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీలను తొలగించమని ఎవరు చెప్పారంటూ నిలదీశారు. కావాలనే దుర్బుద్ధితో వైసీపీ శ్రేణులు టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేందుకు నగరపాలక సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారంటూ ఆగ్రహించారు. టీడీపీ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నగరపాలక సంస్థ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.