చేపల వేటకు బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం, పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం - విశాఖ ఫిషింగ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 12:12 PM IST
Fishing Boat Accident in Bhimunipatnam Beach : విశాఖ జిల్లాలోని భీమునిపట్నం బీచ్ నుంచి చేపల వేటకు బయలుదేరిన బోటు కొద్ది గంటల్లోనే ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యవేట బోటు నిన్న సాయంత్రం భీమిలి బీచ్ నుంచి బయలుదేరగా కొద్ది గంటల్లోనే ప్రమాదవశాత్తు ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. బోట్లో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా బయట్టపడ్డారు. ఈ బోటు ప్రమాదం కారణంగా సుమారు పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని దానయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని దానయ్య కోరారు.
Fishing Boat Problem in Visakhapatnam : బోటు వెనక్కి కొట్టుకుపోతోందని గమనించి అప్రమత్తమైన మత్స్యకారులు నీటిలోకి దూకారు. ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలనైతే కాపాడుకున్నారు. ఆకస్మికంగా ఎదురైన ఈ పెను ప్రమాదానికి మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. రూ. లక్షల్లో నష్టం జరగడంలో బోటు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.