Fishing Harbour: ఫిషింగ్ హార్బర్ అభివృద్దిపై కలెక్టర్‌ను కలిసిన మత్స్యకార సంఘాలు
🎬 Watch Now: Feature Video
Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ది.. మత్స్యకారులు, బోటు యజమానుల అవసరాలకు అనుగుణంగా కాకుండా వేరే విధంగా జరగడంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి. ఈ అభివృద్ది పనుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న విశాఖ కలెక్టర్‌కి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను కలెక్టర్‌కు వివరించాయి. రూ.152 కోట్ల కేంద్ర నిధులతో జరుగుతున్న పనులకు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే పనులు చేస్తున్నారని ఆరోపించారు. రహదారులు, డ్రయినేజి వ్యవస్ధ, మంచి నీటి సౌకర్యం వంటివి అభివృద్ది చేయాలని కలెక్టర్‌ను కోరారు. ముందుగా మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయకుండా అప్రాధాన్యమైన పనుల కోసం ఈ నిధులను వెచ్చించడం తగదని మత్స్యకార సంఘాలు వెల్లడించాయి. గతంలో చెప్పినట్లు కాకుండా ఇప్పుడు వేరే చోట ఫిషింగ్ హార్బర్ కట్టిస్తామని చెప్తున్నారని వాపోయారు. గతంలో మాదిరిగా బోట్ల మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మాకు పోర్టు వాళ్లు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ డీపీఆర్‌లో లేవని తెలిపారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.