ఆకతాయిల నిర్వాకం - మూసేసిన సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం - అగ్ని ప్రమాదం న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 2:56 PM IST
Fire Accident in Movie Theater in YSR District : కడప నగరం పాత బస్టాండ్ సమీపంలోని రాయల్ థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 10 సంవత్సరాలుగా మూసేసిన థియేటర్ ఆకతాయిలకు అడ్డగా మారింది. స్థానిక ఆకతాయిలు రాత్రిపూట మద్యం తాగి సిగరెట్ ఆర్పకుండా పడేసి వెళ్లారు. దీంతో నిప్పు రవ్వలు అక్కడ ఉన్న సీట్లకు అంటుకోవడం వల్ల ఉదయం ఒకసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో థియేటర్లోని సీట్లు అన్ని దాదాపుగా కాలిపోయాయి.
Firefighters Fighting Fires : గురువారం ఉదయం స్థానిక దుకాణదారులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎగిసిన పడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. థియేటర్ చుట్టూ వివిధ రకాల దుకాణాల సముదాయాలు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు ఆర్పడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.