కోటి రూపాయల నిధులు దుర్వినియోగం - పంచాయతీ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై అనుమానాలు - AP news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 2:42 PM IST

Fire Accident in Inkollu Panchayathi Office : ఇటీవల కోటి రూపాయల నిధులు దుర్వినియోగం తెరపైకి వచ్చిన తరుణంలో పంచాయతీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సిబ్బందిపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా ఇంకొల్లు పంచాయతీ కార్యలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆవరణంలో ఉన్న పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చూడగా.. కార్యదర్శి గదిలో నుంచి మంటలు చెలరేగాయి. సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా ఘటన స్థలానికి ఎస్ఐ నాయబ్ రసూల్ సంఘటన స్థలానికి చేరుకుని పిల్లలను విచారించారు. కార్యాలయంలో పని చేసే ఉద్యోగి గదిలో పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టినట్లు పిల్లలు తెలిపారు. అక్కడే ఉన్న ఉద్యోగిని ఎస్ఐ విచారించారు. ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావని ఉద్యోగిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పాడు. విషయం తెలుసుకున్న సర్పంచి ప్రసన్న కార్యాలయానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Employee Set Fire to Documents in Panchayat Office : అయితే ఇటీవల కోటి రుపాయల నిధులు దుర్వినియోగం కుంభకోణం వెలుగు చూసింది. ఈ విషయమై దర్యాప్తు జరిపి నెల రోజుల క్రితం కార్యదర్శి మోహన్​బాబును విధుల నుంచి తొలగించారు. కార్యదర్శితో పాటు నిధుల దుర్వినియోగంలో మరికొందరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధం ఉన్న వ్యక్తులే దస్త్రాల దహనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

One Crore Rupees Funds Missuse in Panchayat Office : కార్యాలయ ఉద్యోగి పెద్ద డబ్బాలో 4 లీటర్ల పెట్రోలు తీసుకురావటం, అందులోంచి చిన్న సీసాలోకి కొంత తీసి కార్యదర్శి గది కిటికీలోంచి లోపలికి విసిరి నిప్పు పెట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చుట్టు పక్కల వారు రావడంతో... ఉద్యోగి మంటలు ఆర్పుతున్నట్లుగా నటించాడని వారు అంటున్నారు. ఇంత జరిగినా పంచాయతీ అధికారులు ఎవరూ స్పందించకపోవటం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.