Victims Agitation: అచ్యుతాపురం అగ్నిప్రమాద మృతుల కుటుంబసభ్యుల ఆందోళన.. - AP Latest News
🎬 Watch Now: Feature Video
Sahithi Labs reactor explosion incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీల్యాబ్స్లో రియాక్టర్ పేలుడు ఘటనలో బాధితుల కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు యాజమాన్యం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చుట్టుపక్కల వారు అందించిన సమాచారంతో పరుగు పరుగుల సెజ్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చినా ఎవరూ సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రులకు తరలించినా, అంబులెన్స్‌లోనికి ఎక్కించే సరికే ప్రాణాపాయ స్ధితిలో ఉన్నా.. వారు కనీసం సమాచారం చెప్పకుండా, కేవలం చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయని మభ్యపెట్టారని ఆరోపించారు. ఈ ఉదయం నుంచి ఫాక్టరీ ఎదుట ఈ బాధిత కుటుంబ సభ్యులు బైటాయించి నిరసన వ్యక్తంచేస్తున్నారు. కేవలం వీరే తమకు ఆధారమని చిన్న పిల్లలతో కాలక్షేపం చేస్తున్న పేదలమని వారు అవేదన వెలుబుచ్చారు. ప్రభుత్వ అధికార్లు తమకున్యాయం చేయాలని వారు వేడుకున్నారు.