Fire Accident: తుళ్లూరులో అగ్ని ప్రమాదం.. ఆహుతైన రాజధాని నిర్మాణ సామాగ్రి - Fire Acciden

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 21, 2023, 4:03 PM IST

Fire Accident In Guntur : గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుళ్లూరు మండలం నెక్కల్లు శివారు ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం తీసుకువచ్చిన ప్లాస్టిక్​ సామాగ్రికి నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. మురుగు నీటి కాలువల నిర్మాణాల కోసం తీసుకువచ్చిన పైపులను గత నాలుగు సంవత్సరాలుగా అక్కడే నిల్వ ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు తేనె సేకరించుకునేందుకు పెట్టిన పొగ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

గత నాలుగేళ్లుగా భారీ స్థాయిలో పైపుల నిల్వతో అటువైపు ఎవరూ వెళ్లకుండా.. జన సంచారం తగ్గిపోయింది. నిర్మానుష్యమైన ప్రాంతం కావటంతో పైపులకు తేనెపట్టు పెరిగిపోయింది. దీంతో తేనె సేకరించుకునే వారు అటుగా వెళ్లిన సమయంలో.. ఆ పైపులకు ఉన్న తేనె పట్టును గమనించి పొగపెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో గాలి వేగం అధికంగా ఉండటంతో.. మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకపోవటంతో పొగ పెట్టినవారు అక్కడినుంచి వెళ్లిపోయారు. వెంటనే మంటలు పక్కన ఉన్న పాస్టిక్​ పైపులకు వ్యాపించాయి. మంటలు గాలికి క్షణాల్లో పైపులకు పూర్తిగా విస్తరించి.. భారీ స్థాయిలో ఎగిసిపడటం ప్రారంభించాయి. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.  ఈ ప్రమాదంలో పైపులు పూర్తిగా అగ్నికి ఆహూతయ్యాయి.  భారీగా నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.