కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కరించాలి - విజయవాడలో రెండో రోజు మహా ధర్నా - మద్ధతు ధర కోసం ధర్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 4:53 PM IST

Farmers Protest In Vijayawada : కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కరించాలంటూ  రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో రెండో రోజు మహా ధర్నా నిర్వహించారు. పంటలకు మద్దతు ధర నిర్ణయించడంతోపాటు, విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న ప్రధానమంత్రి బీమా పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

Raithu Sangala Dharna in Vijayawada : ఈ సందర్భంగా మాట్లాడిన కార్మిక సంఘ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ పై సైతం మండి పడ్డారు. ప్రధాని హయాంలో రైతులకు నష్టం జరగకపోగా... మన దేశీయ సంస్థలను కార్పోరేట్లకు హస్తగతం చేశారని ఆరోపించారు. రైతులకు అన్ని పంటలకు మద్ధతు ధర కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అడుగు జాడల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.