Farmers Protest for Irrigation: సాగునీరులేక ఎండిపోతున్న పంటలు.. రోడ్డుపై భైఠాయించిన రైతులు.. - సాగునీటికోసం రైతుల అవస్థలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/640-480-19892882-thumbnail-16x9-farmers.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 1:35 PM IST
Farmers Protest for Irrigation: పంట పొలాలు ఎండిపోతున్నాయని సాగునీరు విడుదల చేయాలంటూ కృష్ణా జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని ఉయ్యూరు మండలం కలవపాముల వద్ద కంకిపాడు- గుడివాడ రహదారిపై ఒక చెట్టును అడ్డంగా వేసుకుని.. దానిపై కూర్చుని నిరసన తెలిపారు. రైతులు రోడ్డుపై అడ్డంగా బైఠాయించడం వల్ల ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వేలల్లో పెట్టుబడి పెట్టి సాగునీరు అందక పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం(Farmers Protest) చేశారు. సాగునీటిపై తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
"సాగునీరు విడుదల చేయకపోవటం వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. వేలల్లో పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో మాకు పంట పొలాలకు నీరు విడుదల చేయాలంటూ మేము ఆందోళనకు దిగాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతున్నాము." - రైతుల ఆవేదన