Farmers Problems in Penamaluru: విద్యుత్ కోతలతో అల్లాడుతున్న రైతులు.. నీరందక కళ్లెదుటే ఎండుతున్న పొలాలు..
🎬 Watch Now: Feature Video
Farmers Problems in Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సాగు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో వర్షాలు కురవక, ప్రభుత్వం అందిస్తున్న 9 గంటల విద్యుత్.. సరిగా అందక.. రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు లోడ్ ఎక్కువై తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో అందే కాసేపు విద్యుత్ కూడా సరిగా అందడం లేదని రైతులు వాపోతున్నారు.
తాము పడుతున్న ఇబ్బందులను గురించి ఇప్పటికే పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించిన.. వారు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపించారు. ఓ పక్క కాల్వలకు ఆశించిన విధంగా నీరు రాక.. మరో పక్క పొలాల్లో వేసిన బోర్లు సరిగా పనిచేయక ఏం చేయాలో అర్థంకాని స్థితిలోకి తాము వెళ్లిపోయామని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వారి ఆవేదన వ్యక్తం చేశారు.