Farmers Protest: రహదారిపై రైతుల ధర్నా.. ఎంపీ బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకొని
🎬 Watch Now: Feature Video
Farmers Protest: నంద్యాల జిల్లా కానాలలో.. రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. నంద్యాల-జమ్మలమడుగు మధ్య కొత్తగా నిర్మించనున్న.. జాతీయ రహదారికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. నూతనంగా నిర్మించనున్న నంద్యాల-జమ్మలమడుగు జాతీయ రహదారి(167 కె) అలైన్మెంట్( రూపకల్పన) మార్పు చేసి పేద రైతుల పొలాల్లో రోడ్డు వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రహదారిపై వెళుతున్న నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు.
ఎంపీ కాన్వాయ్ ముందు రైతులు, సీపీఎం రైతు సంఘం నాయుకులు బైఠాయించి నిరసన తెలపడంతో వాహన రాకపోకలు నిలిచాయి. దానిని గమనించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి వాహనం నుంచి దిగి రైతులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల కోసం రోడ్డు అలైన్మెంట్ మార్చారని ఎంపీకి రైతులు వివరించారు. స్పందించిన
ఎంపీ అక్కడి నుంచే అధికారులతో ఫోన్లో మాట్లాడి రోడ్డు సర్వే తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూచించారు. రైతుల అభిప్రాయం తీసుకున్నాకే సర్వే మొదలు పెట్టాలని అధికారులకు వివరించారు. దీంతో రైతులు ధర్నా విరమించారు.