పంట నష్టంతో రైతు ఆత్మహత్యాయత్నం - ఆంధ్ర ప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 9:21 AM IST
Farmer Suicide Attempt To Crop Loss: కృష్ణా జిల్లా కోడూరు మండలం వి.కొత్తపాలెంలో కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. బాదర్ల సూర్య ప్రభాకరరావు అనే రైతు పది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట సాగుచేశాడు. కానీ తుపాను వల్ల పంట మొత్తం నేలకొరిగి మొలకలు వచ్చి నష్టం జరిగిందని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడని బంధువులు తెలిపారు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రభాకరరావుకి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.
సెంటు పొలం కూడా లేదు. పది ఎకరాలు కౌలుకు తీసుకుని పంట పండించారు. తుపాను దాటికి పంట మొత్తం నేలకు ఒరిగిపోయింది. పంట నష్టం వచ్చింది. కోతకు పది వేల రూపాయలు అడుగుతున్నారు. ఎకరానికి 50వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పురుగుల మందు తాగేశారు. పంట నష్టం వచ్చినా ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. అధికారుల పంటను చూసి ఎన్ని ఎకరాలో రాసుకుని వెళ్లిపోతున్నాురు.- రైతు భార్య.