Farmer Removed Chilli Crop Due to Lack of Water: భయపడిందే జరిగింది..! నీరందక ఎండుతున్న పంటలు.. రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు
🎬 Watch Now: Feature Video
Farmer Removed Chilli Crop Due to Lack of Water: సాగునీరు అందక ఎదిగిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక అన్నదాతలు కుమిలిపోతున్నారు. సాగునీరు అందకపోవడంతో ఓ రైతు మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చే మిరప పైర్లు తొలగించి ప్రభుత్వంపై తమ నిరసన తెలుపాడు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు గ్రామానికి చెందిన రైతు పమిడాల వెంకట్రావు ఐదు ఎకరాల మిరప సాగు చేశారు. ఎకరాకు ఇప్పటి వరకు రూ.80 వేలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేయగా... ఇప్పుడు ఆ పంట పూత, పిందె దశలో ఉంది.
అమరావతి మేజర్ కాలువ చెంతనే ఉన్నా.. సాగునీరు అందని దుస్థితి నెలకొనడంతో పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరగడం, కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేక ట్రాక్టర్‌తో పంట తొలగించాడు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఆరు తడులకైనా సాగునీరు అందించి తనలాంటి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీరు ఇవ్వకపోతే వైసీపీ పాలనలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.