Farmer Died In Elephant Attack: విషాదం.. చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో రైతు మృతి.. - Mudireddypally elephant attack
🎬 Watch Now: Feature Video
Farmer Died In Elephant Attack: చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందాడు. అటవీ ప్రాంతం కావటంతో తన పంట చేనును కాపాడుకునేందుకు వెళ్లిన రైతుపై.. ఏనుగు దాడి చేయటంతో ఆ కర్షకుడి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన.. మార్కొండయ్య అనే రైతు తన పంట పొలానికి కాపలా కోసమని వెళ్లాడు. వ్యవసాయ పొలం వద్ద కాపలా ఉండగా.. రాత్రి 8 గంటల అక్కడికి వచ్చిన ఓ ఏనుగు రైతుపై దాడి చేసింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైతు మరణానికి కారణం.. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక రైతులు పంట పొలాల దగ్గరికి వెళ్లాలంటేనే ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ఏనుగుల విహారం అధికంగా ఉండటంతో గ్రామస్థులు బెంబెలెత్తిపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టి.. ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.