Farmer Angry on YCP MLA: ఆయన్ని గెలిపించి తప్పు చేశాం.. చెప్పుతో కొట్టుకున్న రైతు - ఇదేం కర్మ మన రాష్ట్రానికి
🎬 Watch Now: Feature Video
Farmer Angry over YCP MLA Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దామలూరులో ఓ రైతు చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిని, సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని కౌలు రైతు షేక్ గాలి సైదా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "ఇదేం కర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా దామలూరులో పంటలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా ముందు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. నష్టపోయిన తమను పరామర్శించలేదని, వ్యవసాయ అధికారులు కూడా కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మా మైలవరానికి, మాకు దరిద్రం పట్టి నష్టపోయాం. మా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఎక్కడ ఏసీలో పడుకున్నాడో మహానుభావుడు, ఆ బూడిద తోలుకుంటా, ఆ డబ్బులు పోగు చేసుకుంటా. ఆయన ముఖం టీవీలో కూడా చూడలేదు నేను. ఒక్కరోజైనా వడ్లు, మొక్కజొన్న కొనమని చెప్పాడా..?'.. అంటూ కౌలు రైతు షేక్ గాలి సైదా వాపోతూ తన చెప్పుతో చెంపలపై కొట్టుకున్నారు.