తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు ఉపేంద్ర - tirumala news
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీవారిని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శించుకున్నారు. రేపు కబ్జా చిత్రం విడుదల సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉపేంద్ర మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం యావత్తు భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కబ్జా చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసాడు.. నటుడు ఉపేంద్ర.. తాజాగా ఉపేంద్ర కబ్జా అనే చిత్రంలో నచినంచారు. ఆ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల కాగా అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఆ సినిమా మీద ఎక్కువగా అంచనాలను పెట్టుకునేలా చేసింది. అయితే ఆ సినిమా రేపు విడుదల కాబోతుంది.