Chandrababu Interview: "రైతులను బెదిరించే స్థాయికి వచ్చారు.. ఇది మంచిది కాదు"..

🎬 Watch Now: Feature Video

thumbnail

Face to Face With Chandrababu: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు రోడ్డెక్కారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని.. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైసీపీ మంత్రులు, నాయకులు రైతులను బెదిరించే స్థాయికి వచ్చారని.. ఇది మంచిది కాదని హెచ్చరించారు. రైతులకు న్యాయం చేయాలనే నినాదంతోనే తమ పోరుబాట సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం నుంచి రైతు పోరుబాట పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. పోరుబాటకు మద్దతుగా రైతులు భారీగా తరలివచ్చారు. ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర సాగునున్న పాదయాత్రలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలిస్తున్నారు. పాదయాత్రలో రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిందా.. లేదా.. సమాధానం చెప్పాలన్నారు. ఫసల్ బీమా ప్రయోజనం ఉపయోగించుకున్నారా.. లేదా..? అని నిలదీశారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని దించేందుకు అన్ని వర్గాలు కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులందరినీ ఆదుకుంటామంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మా ప్రతినిధి ముఖాముఖి..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.