వైసీపీలో బీసీల మాటకు విలువ లేదు - పదవులు తప్ప పరపతి లేదు : ఎంపీ సంజీవ్​కుమార్ - BC Leaders

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 2:27 PM IST

Face to Face With Kurnool MP Sanjeev Kumar : వైసీపీలో బీసీలకు పదవులు తప్ప పవర్ లేదని కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ అన్నారు. బీసీల మాటలకు విలువే లేదన్న ఆయన వైఎస్సార్ కాంగ్రోస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామంటున్నారే తప్ప పార్టీలో సామాజిక న్యాయం లేదని సంజీవ్​ కుమార్ పేర్కొన్నారు. కర్నూలు చుట్టూ నీరున్నా నిల్వ చేసుకుని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. పంటలు పండక లక్షలాది మంది ప్రజలు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీసీల మాటలకు విలువ లేదని, పదవులు ఇస్తున్నారు తప్ప పరపతి లేదని స్పష్టం చేశారు. కర్నూలు ప్రజల సమస్యలు తీర్చలేక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తే చేశారు. సంక్షేమ పథకాలు అమలు తప్ప అభివృద్ధి పనులే చేపట్టడం లేదు, ఎంపీనైన నాకే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని చెప్పారు. బీసీలకు పెద్దపీట మాటల్లో తప్ప ఆచరణలో శూన్యమని తెలిపారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌తో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.