'దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగం జగన్ పాలనలో అథమస్థాయికి దిగజారింది' - జగన్పై మండిపడ్డ మాజీ మంత్రి జవహర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 7:25 PM IST
EX-Minister Jawahar Fires On CM Jagan : చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ పాలనలో అథమస్థాయికి దిగజార్చారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో 50వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 26వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదో ముఖ్యమంత్రి చెప్పాలని మంత్రి జవహర్ (kothapalli samuel jawahar) డిమాండ్ చేశారు.
TDP Jawahar Comments On YSRCP Government : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లి, భార్యతో అమ్మఒడి పథకంపై ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక దానికి ఎందుకు కోతలు పెట్టాడని నిలదీశారు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచి, యాప్ల పేరుతో వారిని వేధిస్తూ జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నాడు-నేడు అయినా ట్యాబ్ల పంపిణీ అయినా జగన్ రెడ్డికి కావాల్సింది కమీషన్లే అని దుయ్యబట్టారు.