Prathidwani : 4ఏళ్లుగా ముస్లిం మైనార్టీలకు ఒక్క కొత్త పథకమైనా తెచ్చారా జగన్..! కనీసం మీరిచ్చిన హామీలైనా గుర్తున్నాయా... - ysrcp govt welfare schemes
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 10:30 PM IST
Prathidwani: మైనారిటీలకు అండగా ఉంటామనే హామీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. నాలుగున్నర ఏళ్లుగా విరుద్ధంగా వ్యవహరించింది. మైనారిటీల సంక్షేమం బదులు సంక్షోభంలో (Minorities Welfare in Deep Trouble) కురుకుపోయారు.పేరుకు కార్పోరేషన్లు, పదవులు అంటూ గాలం వేసిన చివరికి వారికి ఒరిగింది మాత్రం శూన్యం. పైపెచ్చు రాష్ట్రంలో ఎక్కడ చూసిన మైనారిటీలపై వైసీపీ నేతల దాడుల పరంపర (YSRCP Leaders Attack on Minorities) కొనసాగుతోంది. నంద్యాలలో పోలీసు వేధింపుల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబం (Abdul Salam family suicide).. ప్రభుత్వ ధమనాఖాండకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే మైనారిటీలను భయాందోళనకు గురిచేసిన ఉందాతాలు మరెన్నో ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. ముస్లిం మైనార్టీల కోసం ఇచ్చిన హామీలు ఏమిటి.. వాటిల్లో ఎంత వరకు నెరవేర్చారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాడుతున్న మైనార్టీ నేతల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది. వక్ఫ్ బోర్డు ప్రత్యేకాధికారి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ విషయంలో నాడు ఇచ్చిన హామీ ఏమిటి. జగన్ సర్కార్ నేడు చేస్తోంది ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.