PRATIDWANI రాష్ట్రంలో పెరిగిపోతున్న ఆధిపత్య పోకడలు - ఏపీలో అధికార పక్ష విధానం
🎬 Watch Now: Feature Video
PRATIDWANI ఒకటా.. రెండా..! రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదొకచోట అధికారపార్టీ నుంచి ఎదురు అవుతున్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కానీ పరిస్థితి ప్రతిపక్షాలది. మాట్లాడాలంటే భయం, నిరసన వ్యక్తం చేయాలంటే భయం.. దాడులు, ఘర్షణలు, ఆధిపత్య పోకడలు. ఇదే సమయంలో చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. విపక్షాలన్నీ ఇంతగా ఎందుకు వాపోతున్నాయి. వారి ఆవేదనక, ఆక్రోశానికి కారణం ఏమిటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST