PRATHIDWANI పరిశ్రమలు తరలిపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా - ఏపీ ప్రతిధ్వని సమాచారం
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI రాష్ట్రం నుంచి మరో దిగ్గజ కంపెనీ అమర్‌రాజా బ్యాటరీస్ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం, పొయ్యే దాకా పొగపెట్టడం వల్ల.. చివరకు అమర్‌రాజా కంపెనీ రాష్ట్రాన్ని వీడింది. లాభాల కోసమే ఈ కంపెనీ రాష్ట్రాన్ని వీడిందని ఒక మంత్రి వ్యాఖ్యానిస్తే.. సంస్థ పోవడం కాదు, తామే పొమ్మంటున్నామని ప్రభుత్వంలో మరో ముఖ్యుడు సెలవిస్తారు. పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే జరిగే నష్టంపై స్పష్టమైన అంచనా ఉన్న ఏ ప్రభుత్వమైనా ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుందా? ఒక్క అమర్ రాజా విషయంలోనే కాదు.. గతంలో లూలూ, ఫాక్స్‌కాన్,. జాకీ, రిలయెన్స్ జియోలు కూడా ఇలానే రాష్ట్రాన్ని వీడి పోయాయి. పెద్ద కంపెనీలు ఎందుకు ఆంధ్రాను వీడుతున్నాయి? ఈ పరిణామాలతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST