prathidwani కౌలు రైతు కన్నీటి గాథ సర్కారుకు వినిపించడం లేదా - prathidwani latest
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం అవుతోంది. అప్పుల ఊబిలో చిక్కిన ఆ బక్కరైతులకు కాస్తైనా ఊరటనిచ్చే నాథుడు కనిపించడం లేదు. ఆత్మహత్యలు చేసుకున్న అభాగ్యుల దయనీయ గాథలు కనీసం రికార్డుల్లో నమోదుకు నోచుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% వరకు సాగుభూమిని పండిస్తున్న వారికి అందుతున్న సాయం ఎంత? లక్ష కోట్ల రూపాయల పంట రుణాల్లో వారి స్థానం ఎక్కడ? ఈ లెక్కలు పరిశీలిస్తే కౌలు రైతులకు మిగిలింది కంటి తుడుపే అంటున్నారు.. రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ నిపుణులు. ఈ దుస్థితి కారణమేంటి? కనీసం గుర్తింపునకు నోచుకోని కౌలు రైతుల జీవితాలు బాగుపడాలంటే తక్షణం ఎలాంటి చర్యలు అవసరం? కౌలు రైతుల్లో 90 శాతం పైగా వ్యవసాయ కూలీలే అనేది జగమెరిగిన సత్యం అలాంటి 16 లక్షల మంది కౌలురైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 చొప్పున ఇస్తామన్న ముఖ్యమంత్రి అమల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే వర్తింపజేస్తున్నారు. అధికారికంగా అంచనా వేసిన వారిలోనూ 6.25% మందికే రైతు భరోసా అందుతుంది మరి మిగతా వారి పరిస్థితి ఎంటి? అదే అంశంపై నేటి ప్రతిధ్వని.