Prathidwani: నిండా మునిగిన రైతు.. మొద్దు నిద్రలో ప్రభుత్వం..!
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలతో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా.. ధాన్యం కొనుగొలు చేయకపోవడంతో.. నీటిలోనే నానుతున్నా నేపథ్యంలో రైతన్నలు ఇక పంటపై ఆశ వదులుకునే పరిస్థితి నెలకొంది. సీఎం జగన్ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశించినా.. ఫలితాలు అనుకున్నంతలా కనిపించడం లేదు. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుంటున్న రైతులకు.. పంట చేతికి వస్తోందనే ఆనందించే లోపే వర్షాల రూపంలో కన్నీరు తెప్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతి ఏటా 2, 3సార్లు భారీ వర్షాలు, తుపాన్ల రూపంలో రైతులు పంటలను నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే, నష్ట పోతున్న రైతుల్లో ఎందరికి పరిహారం అందుతోంది? పంటల బీమాపై రైతులు ఆలోచించాల్సిన పని లేదనీ.. బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తామని, అప్పట్లో వైసీపీ ఇచ్చిన మానిఫెస్టోలోని హామీ అమలవుతోందా? లక్షలాది రూపాయల పెట్టుబడి.. జీవితాల్నే పణంగా పెట్టిన.. కౌలురైతులకు వానలు, వరదల్లో మిగులుతోంది ఏమిటి? విపత్తు నిర్వహణ నిధి నుంచి సాయం రైతుకు ఇస్తున్నారా? ప్రభుత్వానికి సమగ్ర వ్యవసాయ విధానం అనేది ఉందా? ఇలాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.