దళితులపై దాడులు.. హత్యలు.. అంతే లేదా.. అసలు ఆగేదే లేదా - attacks on scheduled caste people in ap
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18110219-12.jpg)
Pratidwani : ఇదెక్కడి దారుణం అని గుండె దిట్టవు చేసుకునే లోపే.. అంతకు మించిన మరో భయానక ఘటన. రాష్ట్రంలో దళితులపై దాడులు, వారి దయనీయ పరిస్థితుల్ని కళ్ళకు కడుతున్నాయి. ఓ ప్రదేశంలో దళితులపై దాడి అది మరవక ముందే మరోకరికి వేధింపులు.. ఇది మరిచిపోయేలో ఇంకో దగ్గర ఏకంగా హత్యే. ఇలా క్రమం తప్పకుండా జరుగుతున్న దాడులు, వేధింపులు, హత్యలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే ఎస్సీలపై దాడులు, అరాచకాలు అనీ దళిత సంఘాలు ఎంతగా వాపోతున్నా.. పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. డాక్టర్ సుధాకర్‌కు ముందు.. వెనక పరిణామాలు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతుల్లో హతమైన దళిత యువకుడు సుబ్రమణ్యం ఉదంతాలు మరవక ముందే అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది కడప పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న హత్య కేసు. ఈ హింసకు అంతెక్కడ. రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.