ETV Bharat / state

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు - ఎవరెవరికి ఎంత వాటా ? - TIRUMALA NEWS

డెయిరీల మధ్య ఒప్పందం ఎలా కుదిరింది - కొనసాగుతున్న సిట్​ విచారణ

SIT Investigation About Tirumala Laddu Adulterated Ghee
SIT Investigation About Tirumala Laddu Adulterated Ghee (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 8:14 AM IST

SIT Investigation About Tirumala Laddu Adulterated Ghee: తిరుమలలో లడ్డూ తయారీకి నెయ్యి సరపరా టెండర్ దక్కించుకున్న ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ వేదికగా నెయ్యి టాంకర్లు పంపిన బోలేబాబా డెయిరీల మధ్య ఒప్పందం ఎప్పుడు ఎలా కుదిరింది? మరింత ఆదాయం కోసం కల్తీకి పాల్పడి ఎవరెవరు, ఎంతెంత వాటా తీసుకున్నారనే ప్రశ్నల పరంపర సిట్ సందించినట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకున్న నలుగురు నిందితులను మూడో రోజు తిరుపతిలోని సిట్‍ తాత్కాలిక కార్యాలయంలో విచారించారు. మరోసారి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులుగా దాటవేసిన ప్రశ్నలను మరో సారి నిందితులను అడిగారు. ఏ డెయిరీల నుంచి కల్తీ నెయ్యి వచ్చిందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‍ లోని బోలేబాబా డైరీలో గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తోన్న సిట్​లోని ఓ బృందం పలు కీలక విషయాలను గుర్తించింది..

కల్తీ నెయ్యి కేసులో సిట్ కస్టడీలో ఉన్న ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాలను మూడో రోజు తిరుపతి సిట్ కార్యాలయంలో విచారించారు. కస్టడీకి తీసుకుని 48 గంటలు పూర్తి కావడంతో రుయా ఆస్పత్రిలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. రాజు రాజశేఖరన్ మాత్రం గుండె సంబంధిత మందులు వాడకం కొనసాగించాలని వైద్యులు సూచించారు.

ఆస్పత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన నలుగురిని మొదట వేర్వేరుగా విచారించిన అధికారులు అనంతరం అందరినీ కలిపి విచారించారు. రెండు రోజులుగా జవాబులు ఇవ్వని ప్రశ్నలను మరోసారి అడిగారు. స్వచ్చమైన సరిపడేంత నెయ్యి టీటీడీకు సరఫరా చేసే సామర్థ్యం లేని ఏఆర్ డెయిరీ తక్కువ ధర కోట్‍ చేస్తే సామర్థ్య పరిశీలన లేకుండా అప్పగించడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

2019లో బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్నా డైరీ సామర్థ్యం లేదని టీటీడీ కొనుగోలు కమిటీ నిర్ధారణతో టెండర్ రద్దు చేశారు. దీంతో ఆ డెయిరీకి సంబంధించిన విపిన్ జైన్, పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా చేరి తమ నెయ్యిని టీటీడీకి సరపరా చేసేందుకు పన్నిన కుట్రల గురించి సిట్‍ అధికారులు ఆరా తీశారు. ఆ సమయంలో ఏస్థాయి వ్యక్తులు కుట్రలో భాగస్వాములు అయ్యారని ప్రశ్నించారు.

ఇందులో కీలకంగా సమాచారం ఇవ్వాల్సిన వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాపై పలు ప్రశ్నలు సందించినట్లు సమాచారం. బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు వచ్చినట్లు చూపుతున్న ట్రిప్ సీట్లు వే బిల్లులోని తేడాల గురించి ప్రశ్నించారు. ఏఆర్ డెయిరీ నుంచి బయలుదేరినట్లు చెబుతున్న నెయ్యి ట్యాంకర్లు ఎందుకు వైష్ణవి డెయిరీకి వెళ్లి వచ్చాయని అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.

నెయ్యి కల్తీ అనేది వైష్ణవి డెయిరీలో జరిగిందా లేక ఆ రెండు డెయిరీల నుంచే వచ్చిందా అని అధికారులు ప్రశ్నించారు. అపూర్వ చావడా నుంచి అధికారులు విలువైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‍ లోని బోలేబాబా డైరీలో గత కొన్ని రోజులుగా సిట్‍ లోని ఓ బృందం దర్యాప్తు చేస్తోంది. కల్తీకి సంబంధించి డెయిరీలోని కొందరు ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. బోలేబాబా డెయిరీలో పనిచేసే తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది..

మూడో రోజు విచారణ పూరైన తర్వాత నిందితులను తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‍ కు తీసుకెళ్లారు. భద్రత దృష్ట్యా సిట్ కార్యాలయం ప్రధాన గేట్లు మూసి వేసి విచారణ చేపట్టారు. ఇతరులు లోపలికి వెళ్లాల్సి వస్తే తనిఖీలు నిర్వహించి అనుమతించారు.

తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

నెయ్యి కల్తీ కథేంటీ - నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.