'ఇచ్చిన హామీ జగన్ నిలబెట్టుకోవాలి'' - విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ ఆందోళన - Andhra Pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 7:28 PM IST
Employees Protest for Visakhapatnam Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి సరుకు సమస్య లేకుండా పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ప్రత్యేకంగా గనులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్, ఇప్పుడు సొంత రాష్ట్రంలో గనులు కూడా కేటాయించడం లేదని విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ పరిరక్షణ సమితి విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగింది. విజయనగరం జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కేటాయించిన మాంగనీస్, సిలికా గనుల లీజుని పునరుద్ధరించాలని స్టీల్‌ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలంటూ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి విజయనగరం మయూరి జంక్షన్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సాండ్, మాంగనీస్ మైన్స్‌ను పునరుద్ధంచాలని పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మైన్స్‌ను 40 సంవత్సరాల పాటు లీజ్‌కి ఇచ్చిన ప్రభుత్వం, 2022లో లీజు గడువు ముగిసిందన్నారు. ప్లాంట్‌పై టన్నుకు 10 వేల రూపాయల అధిక భారం పడుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.