పంట పొలాలు ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు - అరటి తోట నేలమట్టం - kadatatla palle elephant herd attack

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:41 PM IST

Elephant Herd Attack on Crop Fields: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో బుధవారం ఏనుగుల గుంపు(Elephant Herd) పంటలను ధ్వంసం చేశాయి.

Herd of Elephants Attacked Banana Plantation in Chittor: కడతట్ల పల్లెలో  వరలక్ష్మి అనే మహిళా రైతు సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి తోట సాగు చేస్తోంది. కోత దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోటను ఏనుగులు నేలమట్టం చేశాయని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంట విలువ రూ.3లక్షలు ఉంటుందని, పంట చేతికి వచ్చే సమయంలో ఇలా ఏనుగులు దాడులు చేయడంతో ఆర్థికంగా నష్టపోయానని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు తగిన నష్ట పరిహారం ఇచ్చి బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ప్రతిసారి పంటల సమయంలో ఏనుగులు ధ్వంసానికి పాల్పడుతున్నాయని.. ప్రభుత్వం స్పందించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని బాధితురాలు కోరుతున్నారు. ఏనుగుల దాడితో చిత్తూరు జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.