Electrical short circuit: షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం - What is a short circuit
🎬 Watch Now: Feature Video
Fire Accident in Shopping Mall: రిలయన్స్ స్మార్ట్ షాపింగ్ మాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పవర్ జనరేటర్ కాలిపోయి మంటలు చెలరేగిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. నగరంలోని రిలయన్స్ స్మార్ట్‌లో పవర్ బ్యాకప్‌గా ఉండే పవర్ జనరేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగడంతో జనరేటర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో మాల్ అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టు పక్కల ప్రజలు రిలయన్స్ స్మార్ట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వగా.. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను సురక్షితంగా షాపింగ్ మాల్ నుంచి బయటకు పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సెల్లార్లో ఉన్న జనరేటర్ విలువ రూ 3 లక్షలు ఉంటుందని.. అది పూర్తిగా కాలిపోయిందని సిబ్బంది తెలిపారు. అయితే ఎటువంటి ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.