విజయనగరం జిల్లా కాటకాపల్లిలో వైభవంగా దసరా వేడుకలు.. అలరించిన నృత్యప్రదర్శనలు! - కాటకాపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 4:55 PM IST

Updated : Oct 31, 2023, 10:18 AM IST

Dussehra Sharannavaratri Celebrations: రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తుల సందడితో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే.. విజయనగం జిల్లా కొత్తవలస మండలం కాటకాపల్లి గ్రామంలో అట్టహాసంగా దసరా వేడుకలు నిర్వహిచారు. చొక్కాకుల పద్మలావణ్య, చొక్కాకుల కృష్ణ కిషోర్, చొక్కాకుల రామునాయుడు, పైల సత్యవతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వివిధ రకాల పండ్లు, పూలు, నైవేద్యాలతో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరిపించారు. కాటకాపల్లిలో దసరా శరన్నవరాత్రులు ప్రతిఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారు సంతోషించేలా వేడులు చేశారు. ఇక్కడి అమ్మవారిని పూజించిన వారి కోర్కెలు తప్పక తీరి.. కొంగుబంగారమవుతుందని భక్తుల అపార నమ్మకం. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని చిన్నాపెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో.. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ దసరా ఉత్సవాలు వైభవంగా జరిపించేందుకు.. గ్రామస్థులంతా కలిసి తమ వంతు ఆర్థికసాయంతోపాటు.. సంపూర్ణ సహకారం అందించారు.

Last Updated : Oct 31, 2023, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.