durgamata decoration with money : మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు... రూ.1.80 కోట్ల కరెన్సీ నోట్లతో మండపం అలంకరణ - పశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 5:11 PM IST

Durgamata Decoration With Money In Andhrapradesh : దేవీ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొమ్మిది రోజులపాటు కోలాహలంగా నిర్వహించే ఈ వేడుకల్లో అమ్మవారి అంలంకరణలకు ఎంతో విశిష్టత ఉంది. భక్తులు దుర్గామాతను రోజుకో విధంగా ముస్తాబు చేసి కొలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంలో శ్రీ గంగానమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి నవరాత్రుల్లో మూడో రోజున (బుధవారం) మహాలక్ష్మి రూపంలో దుర్గామాతను కొలుస్తారు. ఈ సందర్భంగా ఏకంగా రూ.1.80 కోట్లతో విగ్రహాన్ని అలంకరించారు. దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తండగా... ప్రత్యేక పూజలు, లలితా సహస్ర నామాలు, కుంకుమ పూజలు చేశారు.  

Fourth Day  Mahalakshmi Ammavaru : అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో దుర్గామల్లేశ్వరి ఆలయంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు భక్తులు. కరెన్సీ నోట్లను ఆలయ  ప్రాంగణమంతటా క్రమవరుసలో అమర్చి అందంగా తీర్చిదిద్దారు. సుమారు 20లక్ష రూపాయల విలువైన నోట్లతో ఈ అలంకరణ చేశారు. ఇందులో  50 నుంచి 500 రూపాయల వరకూ నోట్లను వినియోగించారు. ఈ వినూత్న అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఉంగుటూరులోని చేబ్రోలులో కనకదుర్గమ్మను నోట్ల కట్టలతో అలంకరించారు. మహాలక్ష్మ అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. రూ.7.50 లక్షల నోట్లకట్టలతో అలంకరించిన ఈ అమ్మవారు పూజలందుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.