ఉద్యోగాలివ్వండి - లేకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలే: డీఎస్సీ '98 అభ్యర్థులు - DSC 1998 Eligible Candidates Concern in Guntur
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 7:02 PM IST
DSC 1998 Eligible Candidates Concern in Guntur District : డీఎస్సీ 1998లో అర్హత సాధించిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని పురుగుల మందు సీసాతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అభ్యర్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 6857 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే అందులో సుమారుగా 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 2,363 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు.
ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సీఎం జగన్ స్పందించడం లేదని మండిపడ్డారు. రెండు నెలలుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద దీనికి సంబంధించిన ఫైలు పెండింగ్లో ఉందని తెలిపారు. మిగిలిపోయిన వారందరమూ బడుగు బలహీన వర్గానికి చెందిన వారిమేనని వాపోయారు. ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గానికి ఆశాజ్యోతి అంటారు, కానీ మాకు చాలా అన్యాయం జరుగుతుందని తెలిపారు. డిసెంబరు 15న జరిగే మంత్రివర్గ సమావేశంలో తమ సమస్య పరిష్కరించాలన్నారు. లేకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.